సందీప్ కిషన్ మాయవన్ లో నీల్ నితిన్ ముఖేష్

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (17:11 IST)
Neil Nitin Mukesh, Sandeep Kishan
హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌లో తర్వాత రెండవ భాగం కోసం రెండవసారి చేతులు కలిపారు. 'మాయవన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ కొత్త అప్‌డేట్‌ను అందించారు. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలను పోషించడానికి కొత్తగా మేక్ఓవర్ అవుతున్నారు. నీల్ తన పాత్ర కోసం తన డిక్షన్‌పై వర్క్ చేస్తున్నారు. బరువు కూడా తగ్గుతారు.
 
మాయావన్‌లో సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఓటీటీ సిరీస్‌లలో నటించిన ఆకాంక్ష మాయావన్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తోంది.
 
టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్ కె తిల్లై డీవోపీ గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
 
తారాగణం: సందీప్ కిషన్, ఆకాంక్ష రంజన్ కపూర్, నీల్ నితిన్ ముఖేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments