Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ కిషన్ హాిిరోతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Advertiesment
Sundeep Kishan
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (17:48 IST)
Sundeep Kishan
హీరో సందీప్ కిషన్ విభిన్న తరహా చిత్రాలలో తనదైన వైవిధ్యాన్ని కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘ఊరు పేరు భైరవకోన సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు.  అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
మాయవన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మాయవన్‌కి సీక్వెల్ కానుంది. టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది .
 
ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు దామోదర్ ప్రసాద్ క్లాప్‌ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.
 
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,  నాని దసరాకి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించి, ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్న సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మీ అభిమానం నాకు వచ్చేది కాదు : రాఘవ లారెన్స్