Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి పాయల్ అరెస్టు.. నిబంధనల బెయిల్‌పై విడుదల

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:27 IST)
దేశ తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్‌లాల్ నెహ్రూతో పాటు గాంధీ కుటుంబాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టినందుకు సినీ నటి పాయల్ రోహత్గీ అరెస్టు అయ్యారు. ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత పాయల్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 8 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. ఈ కేసులో ఆమెకు తాజాగా నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్‌తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా.. పాయల్ జైలు నుంచి విడుదలైంది.
 
కాగా, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను దూషిస్తూ పాయల్ రోహత్గి సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పోస్ట్ చేసింది. వీటిపై రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చర్మేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు అక్టోబరు పదో తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమెపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments