బాలయ్య బాబూ.. ఏంటి బాబు ఇది... నర్తనశాల రిలీజ్ అవసరమా?

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (15:28 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ 'నర్తనశాల' చిత్రం కోసం చిత్రీకరించిన 16 నిమిషాల ఫుటేజ్‌ని రిలీజ్ చేశారు. నర్తనశాల సినిమాలోని 16 నిమిషాల ఫుటేజ్ రిలీజ్ చేస్తానని ప్రకటించగానే... ఎలా ఉంటుందో..? ఎలా డైరెక్ట్ చేసారో..? చూడాలి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది. 
 
అయితే... నర్తనశాల శ్రేయాస్ ఏటీటీలో రిలీజ్ చేసారు. తీరా చూసాకా... సామాన్య ప్రేక్షకులే కాకుండా బాలయ్య అభిమానులు సైతం విమర్శిస్తుండడం విశేషం. అవును... బాలయ్య అభిమానులకు కూడా అసలు నచ్చలేదట. అంత ఘోరంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
 
ఇందులో ఉన్న కథ విషయానికి వస్తే... ఆసక్తిగా చూసినవాళ్లకి నర్తనశాల చిత్రంలోని 16 నిమిషాల ఎపిసోడ్ నిరాశనే మిగిల్చింది. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు.. ఎవ్వరికంట పడకుండా తామూ ధరించబోయే వేషాల గురించి అరిగిపోయిన పాత డైలాగ్స్ చెబుతుండటం చూస్తుంటే.. ఏంటి ఇది అనిపిస్తుంది. 
 
ఏదోలా మొత్తానికి ఓ సుదీర్ఘ సన్నివేశాన్ని లాక్కోస్తారు. అజ్ఞాతవాసానికి సన్నద్ధం అవ్వడానికే ఈ ఫిల్మ్‌లో సగం ఫుటేజ్ సరిపోయింది. పోనీ ఈ సుదీర్ఘ సన్నివేశంలో ఏమైనా ఆసక్తి ఉందా..? అంటే.. అదీ లేదు.
 
ఈ 16 నిమిషాల ఫుటేజ్ చూసిన వాళ్లు... బాలయ్య బాబు.. ఏంటి బాబు ఇది. నర్తనశాలను ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమా..? అంటూ అభిమానులే విమర్శిస్తుండడం విశేషం. మరి... ఈ విమర్శల పై బాలయ్య స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. 41కి చేరిన మృతుల సంఖ్య

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments