Webdunia - Bharat's app for daily news and videos

Install App

హారర్ చిత్రాలకు పూర్తిభిన్నంగా నయనతార 'డోర' మూవీ

దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "డోర". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:10 IST)
దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం "డోర". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలో తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ... విభిన్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న హారర్ చిత్రమిది. ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. 'డోర' అనే పేరు వెనకున్న రహస్యమేమిటనేది తెరపై ఉత్కంఠను పంచుతుంది. ప్రారంభం నుంచి ముగింపువరకు ప్రతి సన్నివేశం థ్రిల్‌ను కలిగిస్తుంది. నయనతార నటన, పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. 
 
గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఇటీవలే విడుదలైన తమిళ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ నెలలోనే తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేస్తాం. మా సంస్థ నుండి వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments