Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ బాబు చేతుల మీదుగా నయనతార ‘అంజలి CBI’ చిత్ర ట్రైలర్

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (21:43 IST)
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో అనువదిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార టైటిల్ రోల్ సి.బి.ఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుందని.. అంజలి సీబీఐ సినిమా విడుదలకు అల్ ది బెస్ట్ చెప్పారు ఆయన. 
 
ఈ చిత్రంలో అథ‌ర్వ‌, రాశీఖ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ప్ర‌తినాయకుడిగా న‌టించారు. ప్ర‌ముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్ర‌మాదిత్య అనే అతిథి పాత్ర‌లో న‌టించారు. న‌య‌న‌తార భ‌ర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యాన‌ర్ సంస్థ‌లో సిజే జ‌య‌కుమార్ నిర్మించారు. 
 
హిప్ హాప్ త‌మిళ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్ డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. తెలుగు అనువాద కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్నాయి. విశ్వ‌శాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన తెలుగు హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు నిర్మాత‌లు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్. ఫిబ్ర‌వ‌రి 22న అంజ‌లి సిబిఐ ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments