Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు నుంచి విడాకులు కోరిన రెండోభార్య...

Webdunia
మంగళవారం, 19 మే 2020 (11:23 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీకి మరోమారు సంసార కష్టాలు ఎదురయ్యాయి. ఈయన రెండో భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. లాక్డౌన్ సమయంలోనే ఈ విడాకులు నోటీసులను ఆమె పంపించారు. ఇపుడు ఇది బాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. 
 
నవాజుద్దీన్ సిద్ధిఖీ గతంలో షీబా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం సంసార జీవిన తర్వాత ఆమె నుంచి విడాకులు పొందారు. అటు పిమ్మట అలియా అనే మహిళను 2009లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరి సంతానం కూడా ఉంది.
 
ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకులు కోరుతూ అలియా కోర్టును ఆశ్రయించింది. న‌వాజుద్దీన్ కుటుంబం విష‌యంలో ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో అలియా మే 7న లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్టు తెలుస్తుంది. 
 
కోవిడ్‌-19 కారణంగా లాక్డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన త‌ర్వాత చెల్లించాల్సిన భ‌ర‌ణం గురించి కూడా ఇందులో ప్ర‌స్తావించారు. దీనిపై న‌వాజుద్దీన్ ఏం స్పందిస్తారా అనేది చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments