Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌మిళ హీరో ధ‌నుష్ పైన తెలుగు హీరో న‌వీన్ చంద్ర కామెంట్ చేయ‌డానికి కార‌ణం..?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (20:28 IST)
తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర అందాల రాక్షసితో నటుడుగా ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే … ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నవీన్ హీరోగానే చేయాలని ఫిక్స్ కాలేదు. అందుకే పాత్ర నచ్చితే విలన్ గాచేయడానికి కూడా వెనకాడ్డం లేదు. 
 
త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవలో విలన్ పాత్రలో అదరగొట్టిన నవీన్ కు ఆ తర్వాత అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఇటు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన్ ప్రతిభ కోలీవుడ్‌లోనూ కనిపించబోతోంది. అక్కడి స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నవీన్ చంద్ర ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. కోలీవుడ్లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దురై సెంథిల్ కుమార్ దర్శకుడు.
 
ఇక ఈ సినిమాలో నటించడం పట్ల నవీన్ చంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘ ధనుష్‌తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్ స్టార్ ఆయన. మే నెల నుంచి రెండో షెడ్యూల్‌కు వెళ్లబోతున్నాం. ఈ షెడ్యూల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్‌తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్‌తో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments