Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ అవార్డులు మా బాధ్యతను పెంచింది - నేచురల్ స్టార్ నాని

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (19:16 IST)
వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం `అ!`. హీరో నాని, ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. 
 
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66 జాతీయ అవార్డుల్లో `అ!` చిత్రం మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా.. 
నిర్మాత నాని మాట్లాడుతూ - ``కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మా వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. తొలి ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో `అ!` సినిమాను రూపొందించాం. 
 
సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు.. ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు మేకప్, వి.ఎఫ్.ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహానిచ్చింది. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా ఎంటైర్ యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments