Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ పడవలో పార్టీ చేసుకున్న మాట నిజమే.. కానీ.. : శ్రద్ధ కపూర్

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:25 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎటువైపు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తర్వాత పలువురు హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పలువురు హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేసి విచారణ జరుపుతోంది. ఇందులోభాగంగా, తొలుత రకుల్ ప్రీత్ సింగ్ నుంచి మొదలుపెట్టి శ్రద్ధా కపూర్‌తో ముగించింది. ఎన్సీబీ విచారణకు హాజరైన ఈ హీరోయిన్లందరూ తమకు తెలిసిన సమాచారాన్ని అధికారులకు చెప్పారు. అయితే, అధికారులు మాత్రం వీరి మాటలు విశ్వసించడం లేదు. దీంతో హీరోయిన్లందరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిని పరిశీలించనున్నారు. 
 
ఈ క్రమంలో విచారణ సమయంలో శ్రద్ధా కపూర్ కొంత స్పష్టంగా, మరికొంత అస్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం శ్రద్ధా ఏం చెప్పిందంటే... "చిచ్చోరే" సినిమా సమయంలో సుశాంత్‌కు చెందిన పవనా ఫాంహౌస్‌కు వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుని భోజనం చేశారం ఆ తర్వాత సుశాంత్‌కు చెందిన బోటులో పార్టీ చేసుకున్నాం. అర్థరాత్రి వరకు అందరం పాటలు వింటూ ఆస్వాదించాం. నేను అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు" అని వివరించింది.
 
అయితే సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాతో వాట్సాప్ చాట్‌పై అధికారులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని జాతీయ మీడియా పేర్కొంది. కాగా, దీపిక పదుకొనే సరైన రీతిలో సమాధానాలు ఇవ్వలేదని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments