Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ప్రైమ్ లోనే జూలై 20న నారప్ప

Webdunia
సోమవారం, 12 జులై 2021 (16:39 IST)
Narapp still
`నార‌ప్ప‌` సినిమా మొద‌ట అనుక‌న్న‌ట్లే ఓటీటీలో విడుద‌ల‌కాబోతుంది. ఇటీవ‌లే థియేట‌ర్లు ఓపెన్ చేసుకోవ‌చ్చ‌నే రెండు తెలుగు ప్ర‌భుత్వాలు వెల్ల‌డించినా అవి పైపై మాట‌గానే అనిపించాయి. థియేట‌ర్ల య‌జ‌మానులు అందుకు సిద్దంగా లేరు. అందుకే థియేట‌ర్లు ఇప్ప‌ట్లో ఓపెన్ అయ్యే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. క‌నుక‌నో వెంక‌టేస్ నార‌ప్ప ఈనెల 20న అమేజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ సోమ‌వారంనాడు అధికారికంగా ప్ర‌క‌టించింది.
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ఇత‌ర‌ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,  ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,  కథ: వెట్రిమారన్‌

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments