Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత యూ-టర్న్‌లో భూమిక: దెయ్యం పాత్రలో?

''మిడిల్ క్లాస్ అబ్బాయ్'' సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన నిన్నటితరం నాయిక భూమిక. ఈమె తాజాగా నాగచైతన్య ''సవ్యసాచి'' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపిస్తోంది. తాజాగా భూమిక యూటర్న్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సి

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (14:27 IST)
''మిడిల్ క్లాస్ అబ్బాయ్'' సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన నిన్నటితరం నాయిక భూమిక. ఈమె తాజాగా నాగచైతన్య ''సవ్యసాచి'' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపిస్తోంది. తాజాగా భూమిక యూటర్న్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కన్నడ హిట్ చిత్రాల జాబితాలో చేరిన ''యూ టర్న్'' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
 
ఇందులో హీరోయిన్‌గా సమంత నటిస్తుండగా, ఇందులో భూమిక కీలక రోల్ చేయనుంది. కన్నడలో రాధికా చేతన్ పోషించిన దెయ్యంలో పాత్రలో భూమిక కనిపించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకున్న భూమిక.. థ్రిల్లర్‌ మూవీలో దెయ్యం పాత్రను పోషించేందుకు అంగీకరించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయిన ఈ సినిమా రెండో షెడ్యూల్ ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments