Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్మదా నదిలో శ్రీదేవికి తర్పణం.. ఎందుకో తెలుసా?

శ్రీదేవి మృతిని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో వెల్లుల్లి వ్యాపారం చేసే అమ్జాద్ అనే యువకుడు తాను అమితంగా ఆరాధించే నటి శ్రీదేవికి తర్పణం విడిచాడు. శ్రీదేవి మరణించిన తర్వాత పదోరో

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (13:17 IST)
అతిలోక సుందరి శ్రీదేవి తమతో లేరనే విషయాన్ని ఆమె కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. శ్రీదేవి హఠాన్మరణంతో షాక్‌లో ఉన్న జాహ్నవి తన తల్లిని స్మరించుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేసింది. దడక్ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తున్న జాహ్నవి.. తాజాగా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో శ్రీదేవి నటించాల్సి వుంది. అయితే శ్రీదేవి మృతితో ఆమె స్థానాన్ని బాలీవుడ్ సుందరి మాధురీ దీక్షిత్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్టు చేసింది జాహ్నవి.

కాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో వివాహం అనంతరం సినిమాకు గుడ్‌ బై చెప్పేసిన శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. చివరిగా మామ్ మూవీలో నటించారు. ఈ రెండు చిత్రాలతో తన పూర్వవైభవాన్ని అందిపుచ్చుకున్న శ్రీదేవితో వరుస చిత్రాలను చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ క్యూ కట్టారు. 
 
ఈ క్రమంలోనే కరణ్ జోహార్ కూడా ఆమెతో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇంతలో శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో.. కరణ్ శ్రీదేవి స్థానంలో మాధురీ దీక్షిత్‌ను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మాణంలో అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా అమ్మ హృదయానికి దగ్గరగా వుంటుందని.. అమ్మను గుర్తు చేస్తుందని.. ఈ సినిమాలో భాగం కాబోతున్న మాధురిజీకి డాడీ, ఖుషీకి తన తరపున థ్యాంక్స్ చెపుతూ.. మాధురీ, శ్రీదేవి కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది జాహ్నవి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు శ్రీదేవి మృతిని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో వెల్లుల్లి వ్యాపారం చేసే అమ్జాద్ అనే యువకుడు తాను అమితంగా ఆరాధించే నటి శ్రీదేవికి తర్పణం విడిచాడు. శ్రీదేవి మరణించిన తర్వాత పదోరోజు శిరోముండనం చేయించుకోవడమే కాక అన్నదానం కూడా చేశాడు.

తాను ధామ్‌నోడ్‌లో ఉంటానని, శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. శ్రీదేవి అకాలమరణం బాధించిందని.. అందుకే నర్మదా నదిలో శ్రీదేవికి తర్పణం విడిచానని.. ఇక్కడ తర్పణాలు విడిస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని తెలుసుకున్నానని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments