Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కథలో రాజకుమారి'గా రానున్న నారా రోహిత్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (15:52 IST)
వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో నారా రోహిత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కథలో రాజకుమారి'. నమిత ప్రమోద్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్‌ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'కార్తికేయ' శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథ ఇది. ప్రస్తుతం హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాలలో షూటింగ్‌ జరుగుతుంది. జూన్‌ 27 నుంచి జూలై 15 వరకు జరిగే షెడ్యూల్‌తో మూడు సాంగ్స్‌, టాకీపార్ట్‌ పూర్తవుతుంది. ఆగస్టులో జరిగే చివరి షెడ్యూల్‌లో బ్యాలెన్స్‌ మూడు పాటలను చిత్రీకరించనున్నాము. జూలై రెండో వారంలో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..' అని తెలిపారు. 
 
నారా రోహిత్‌, నమిత ప్రమోద్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ళ భరణి, అజయ్‌, ప్రభాస్‌ శ్రీను, స్వామిరారా సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయేష్‌ నాయర్‌, సంగీతం: ఇళయరాజా, పాటలు: కృష్ణచైతన్య, రామజోగయ్య శాస్త్రి, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, కళ: సాహి సురేష్‌, సహనిర్మాత: బీరం సుధాకర్‌ రెడ్డి, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ, నిర్మాత: కార్తీకేయ శ్రీనివాస్‌, దర్శకత్వం: మహేష్‌ సూరపనేని. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments