Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజకు మిస్సయింది... దిల్ రాజు అడ్డుపడుతున్నాడు... 'అర్థనారి'కి షాక్!

చాలామంది హీరోలు తమతమ సినిమాల్లో వేలు పెడుతుంటారు. దర్శకత్వశాఖలో అనుభవం ఉన్నవారు మరీనూ. సినిమాలు చేసిచేసి. చూసి చూసి.. కూడా.. అందులో వేలుపెడుతుంటారు కొందరు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (15:46 IST)
చాలామంది హీరోలు తమతమ సినిమాల్లో వేలు పెడుతుంటారు. దర్శకత్వశాఖలో అనుభవం ఉన్నవారు మరీనూ. సినిమాలు చేసిచేసి. చూసి చూసి.. కూడా.. అందులో వేలుపెడుతుంటారు కొందరు. ఏదిఏమైనా. రవితేజకు దర్శకత్వ శాఖలో అనుభవం చాలావుంది. అనుకోకుండా హీరో అయిపోయాడు.. ఒకప్పుడు పెద్ద సక్సెస్‌ హీరో. ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ మధ్య రవితేజకు ఓ కథ వచ్చింది. దర్శకుడు భానుశంకర్‌ ఆ కథను 2 గంటలు చెప్పాడు. బాగా నచ్చింది. అయితే. దాన్ని పూర్తిగా మార్చేసి కమర్షియల్ యాంగిల్‌ చేయాలని సూచించాడట రవితేజ.
 
ఇది నచ్చని దర్శకుడు కుదరని ముఖాన్నే చెప్పి వచ్చేశాడు. అలా మరో ఇద్దరికి వద్దకు వెళ్ళాడు. వాళ్లూ అదే పరిస్థితి. ఇంతకీ కథలో ఏం మార్పు ఉందని గమనిస్తే... సగం స్త్రీ, పురుషుడుగా పాత్ర చేయాలి. రవితేజకు ఆల్రెడీ ఆ పాత్రలు చేయడం తెలుసు. పనిలోపని.. సామాజిక అంశంతో కూడిన కథ కాబట్టి.. దాన్ని కమర్షియల్‌ చేయడం ఇస్టంలేదట దర్శకుడికి. చివరికి.. ఓ కొత్త నటుడ్ని పెట్టి ఆ సినిమాను తెరకెక్కించాడు. 
 
'అర్థనారి'గా జులై ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలై మంచి రెస్సాన్స్‌ వస్తుంది. గతంలో టి.కృష్ణ. వేజళ్ళ సత్యనారాయణ దర్శకత్వం సినిమాల్లాగా టాక్‌ వస్తుంది. సెన్సార్‌ చూసి తెగ మెచ్చుకున్నారు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్న ఈ చిత్రం విడుదలయ్యాక.. ఎటువంటి క్రేజ్‌ తెస్తుందో చూడాలి. 
 
అయితే.. ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేయకుండా దిల్‌రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దర్శకుడితో మాట్లాడి తన సినిమా 'రోజులు మారాయి' విడుదలవుంది. అందుకే కొన్నిరోజులు వాయిదా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడని సమాచారం. అంటే.. అర్థనారిపై వున్న అంచనాలతో వాయిదా వేసుకోమన్నాడా! అనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments