Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు తేజ అహింస నుండి పాట విడుదల చేసిన నాని

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (09:28 IST)
Abhiram, Geetika
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అహింస 'తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ మెటిరిరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచాయి.
 
తాజాగా ఈ చిత్రం నుండి 'కమ్మగుంటదే' పాటని  నేచురల్ స్టార్ నాని చేశారు. ఆర్పీ పట్నాయక్ ఈ పాటని అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే మనసుని ఆకట్టుకునేలా వుందీ పాట.
 
ఈ పాటలో అభిరామ్, గీతికా ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని లవ్లీగా ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు'కమ్మగుంటదే' పాట కూడా ఫోక్ చార్ట్ బస్టర్ గా అలరిస్తోంది.
 
ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.  సుప్రియ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments