Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోతో సహనం కోల్పోతున్న నాని.. ఎందుకంటే..?

బిగ్‌బాస్‌ హౌజ్‌ అంటేనే అదో జైలు వంటిది. కాకుంటే స్టార్‌ హోటల్‌లాగా ఉంటుంది అంతే. జైళ్లో పత్రికలు, టివి అందుబాటులో ఉంటాయి. రోజుకో కొత్త ఖైదీ వస్తుంటారు పోతుంటారు. తమతో పాటు వందలమంది ఉంటారు. కానీ బిగ్‌బాస్‌ హౌజ్‌ అటువంటిది కాదు. హౌజ్‌లో కనీసం గడియారం

Webdunia
సోమవారం, 9 జులై 2018 (17:23 IST)
బిగ్‌బాస్‌ హౌజ్‌ అంటేనే అదో జైలు వంటిది. కాకుంటే స్టార్‌ హోటల్‌లాగా ఉంటుంది అంతే. జైళ్లో పత్రికలు, టివి అందుబాటులో ఉంటాయి. రోజుకో కొత్త ఖైదీ వస్తుంటారు పోతుంటారు. తమతో పాటు వందలమంది ఉంటారు. కానీ బిగ్‌బాస్‌ హౌజ్‌ అటువంటిది కాదు. హౌజ్‌లో కనీసం గడియారం ఉండదు. శనివారం, ఆదివారం వచ్చే హోస్ట్‌ను తప్ప…. ఇటు స్టూడియోలో కూర్చుని వుండే జనాన్ని టివిలో చూసే అవకాశం కూడా ఉండదు. ఒకవిధంగా ఇంటి సభ్యులంతా ఒక విధమైన మానసిక స్థితిలో ఉంటారు. ఇలాంటప్పుడు వారాంతంలో వచ్చే హోస్ట్‌ ఇంటి సభ్యులకు పెద్ద ఊరటగా ఉండాలి. 
 
కానీ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నేచరల్‌ స్టార్‌ నాని అలాంటి భావన ఇంటి సభ్యులకు కలిగించలేకపోతున్నారు. మొదటి సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను చూసేందుకు శనివారం ఎప్పుడొస్తుందా అని సభ్యులంతా ఎదురుచూసేవారు. ఎన్‌టిఆర్‌ను చూడగానే ఇంటి లోపల ఉన్నవారంతా ఆ వారంలో పడిన కష్టమంతా మరచిపోయేవారు. వాళ్ల ముఖాల్లో వెయ్యి వాట్ల బల్బు అంతటి కాంతి కనిపించేది. సభ్యులు పదేపదే చెప్పేవాళ్లు కూడా…. మీ కోసం శనివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం అన్నా అని జూనియర్‌తోనే చెప్పేవాళ్లు.
 
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… రెండో సీజన్‌కు హాస్ట్‌గా ఉన్న నాని ఇంటి సభ్యులతో అంత క్లోజ్‌గా వ్యవహరించలేకపోతున్నారు. వాళ్ల తప్పులను ఎంచడమే పనిగా పెట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు. రెండోవారంలో మొదటి రోజు (శనివారం) ఇది స్పష్టంగా కనిపించింది. వారాంతంలో సరదగా సాగాల్సిన షోను సీరియస్‌గా నిర్వహించారు. ఎక్కడా కాస్తంత కూడా జోష్‌ కనిపించలేదు. కోర్టులో న్యాయవాది ప్రశ్నించినట్లు ప్రశ్నించడం వల్ల సీరియస్‌నెస్‌ తప్ప ఆహ్లాదం ఎలావస్తుంది? బిగ్‌బాస్‌ తరపున సభ్యులను అడుగుతున్న ప్రశ్నల్లోనూ హేతుబద్ధత లోపించింది. 
 
సభ్యులు తిరిగి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితే. తేజ, తనిష్‌, సామ్రాట్‌ ముగ్గురూ ఒక గ్రూపుగా ఉంటున్నారని పదేపదే నాని చెప్పారు. దీన్ని తేజ ప్రశ్నించింది. మా ముగ్గురి అభిప్రాయాలు కలిశాయి. కాస్త క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన దాన్ని గ్రూప్‌ అని ఎలా అంటారు అని నిలదీసింది. దీనికి నాని సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఇదేవిధంగా కెప్టెన్‌గా సామ్రాట్‌ విఫలమయ్యాడన్న అభిప్రాయంతో నాని మాట్లాడారు. 
 
ఇదే ప్రశ్నను బాబు గోగినేనిని అడిగితే… నేను అలా అనుకోవడం లేదు. ఇంటిని సజావుగా నడపడం కోసం సామ్రాట్‌ అందరి కోపాలను తనపై వేసుకున్నారు. ఇది మంచి నాయకత్వ లక్షణం’ అని వివరణ ఇచ్చేసరికి… నాని కూడా యూటర్న్‌ తీసుకున్నారు. మీరు ఈ విషయం చెప్పకుంటే సామ్రాట్‌లోని ఈ కోణం బయటకు వచ్చేది కాదని అప్పుడు పొగడటం మొదటుపెట్టారు. మరి ఇంటిని బయట నుంచి గమనిస్తున్న బిగ్‌బాస్‌, ఆయన అనుచురులు బాబు గోనినేని చేసిన విశ్లేషణను చేయలేకపోయారా? తప్పొప్పులు ఎంచేటప్పుడు ఆషామాషీగా చెప్పకూడదు. అన్ని కోణాల నుంచి విశ్లేషించాలి. హోస్ట్‌ అడిగే ప్రశ్న సమంజసంగానూ, హేతుబద్ధంగానూ ఉందని ప్రేక్షకులూ భావించాలి. లేకుంటే షో అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments