Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంటే సుందరానికి' నాని కొత్త సినిమా టైటిల్ అదుర్స్

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (15:36 IST)
Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'V'అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో పలకరించాడు. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. 
 
మొత్తంగా నాని లాండ్ మార్క్ 25వ సినిమా థియేటర్స్‌లో కాకుండా కరోనా కారణంగా ఓటీటీలో విడుదల అవడంపై నాని అభిమానులు కాస్తంత నిరాశ పడ్డారు. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్థించుకోలేకపోతున్నారు. 
 
ఆ సంగతి పక్కన పెడితే... తాజాగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. 
 
మరోవైపు నాని.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్' సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి 'అంటే సుందరానికి' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
 
ఈ టైటిల్ పోస్టర్‌లో నాని వెనకాల తిరిగి పంచె కట్టులో పల్లెటూరు యువకుడి పాత్రలో నటించబోతున్నట్టు కనబడుతోంది. అంతేకాదు పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే వ్యక్తి విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. 
 
పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. 'కృష్ణార్జున యుద్ధం'లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించి 2021లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments