Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని స్పీడుకు బన్నీ-మహేష్ బెంబేలు.. స్పైడర్‌ వాయిదా పడిందా?

నాని స్పీడుకు స్టార్ హీరోలు సైతం జడుసుకుంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. మంచి కథలను ఎంచుకుంటూ.. సూపర్ హిట్ కొట్టడంలో ముందుండే నాని స్పీడుకు బ్రేక్ వేయలేకపోతున్నామే అంటూ బన్నీ వంటి హీరోలు కూడా

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:12 IST)
నాని స్పీడుకు స్టార్ హీరోలు సైతం జడుసుకుంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. మంచి కథలను ఎంచుకుంటూ.. సూపర్ హిట్ కొట్టడంలో ముందుండే నాని స్పీడుకు బ్రేక్ వేయలేకపోతున్నామే అంటూ బన్నీ వంటి హీరోలు కూడా ఆలోచిస్తున్నారట. ఈ సంవత్సరం తొలుత 'నేను లోకల్' సినిమాతో హిట్‌ను అందుకున్న నాని మరో నాలుగు నెలలు గడవకుండానే తన రెండవ సినిమాను రిలీజ్ చేయడానికి లైన్ క్లియర్ చేసాడు. 
 
తాజాగా నాని నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 23వ తేదీని రిలీజ్ కానుంది. ఇదే తేదీన మహేష్ స్పైడర్‌ను ముందుగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ నాని సినిమా రావడంతో సినిమాను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే అదే తేదీన అల్లుఅర్జున్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో నాని-బన్నీల మధ్య కలెక్షన్ల వార్ ఉంటుందని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. కొత్త దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందిన 'నిన్ను కోరి' సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ ప్లే మాటలు సమకూరుస్తుండటం విశేషం. 'జెంటిల్ మన్' బ్యూటీ నివేదా థామస్ మరోసారి నానితో జత కడుతుండగా ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ తప్పకుండా యూత్‌కు కనెక్ట్ అవుతుందని సినీ యూనిట్ అంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments