విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" నుంచి నందనందనా..' లిరికల్ సాంగ్ వచ్చేసింది

డీవీ
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (16:46 IST)
Vijay Deverakonda, Mrinal Thakur
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ఫిల్మ్ "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఇవాళ ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' రిలీజ్ చేశారు. 
 
'నందనందనా..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సిధ్ శ్రీరామ్ పాడారు. 'ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చీ గిచ్చకా..ప్రాణాన్ని గుచ్చీ గుచ్చకా..చిత్రంగా చెక్కింది దేనికో..' అంటూ సాగిన ఈ పాట క్యాచీ ట్యూన్ తో ఇన్ స్టంట్ ఛాట్ బస్టర్ అవుతోంది. ఈ లిరికల్ వీడియోతో 'నందనందనా..' పాట "ఫ్యామిలీ స్టార్" మూవీకి ఒక స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments