Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"విజు" అభిప్రాయం, సలహా తీసుకుంటాను.. రష్మిక మందన్న

Advertiesment
Rashmika Mandanna & Vijay Deverkonda

సెల్వి

, బుధవారం, 31 జనవరి 2024 (22:41 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించిన యానిమల్ విజయంలో దూసుకుపోతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రను పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక తాను 'విజు' (విజయ్ దేవరకొండ) కలిసి ఎలా సినిమా జర్నీ ఎలా సాగిందో తెలిపింది. 
 
"నేను ప్రస్తుతం నా జీవితంలో ఏ పని చేసినా, దానికి అతని సహకారం ఉంటుంది," అని రష్మిక వెల్లడించింది. ఇంకా, ఆమె ఏ పని చేసినా అతని సలహా తీసుకుంటానని విజయ్ అభిప్రాయం అవసరమని రష్మిక చెప్పింది.
 
ఇదిలా ఉంటే, రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగుతుందని ఇటీవల పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ ఈ వార్తలను ఖండించారు. రష్మిక- విజయ్ ప్రేమలో వున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ఇద్దరూ తమ సంబంధాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ తాజా చిత్రం ప్రకటన