అందరికీ ఆయన బాలయ్య.. నా ఒక్కడికి ఆయన ముద్దుల మావయ్య

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:58 IST)
సినీనటుడు, హిందూపురం శాసన సభ్యుడు, యువరత్న బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అల్లుడు నారా లోకేష్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ ట్విట్టర్‌లో ''అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. 
 
బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు. నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా... మీరు మరెన్నో చిత్రాల్లో నటించి... మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు.
 
మరోవైపు బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని బంగారు బుల్లోడు యూనిట్ బాలకృష్ణకు ప్రత్యేక విషెష్ అందజేశారు. హీరోగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న అల్లరి నరేష్‌కు మహర్షి చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. నరేష్ యాక్టింగ్‌కు అందరూ మరోసారి ఫిదా అయ్యారు.
 
ఇక ఇప్పుడు బంగారు బుల్లోడు సినిమాలో నటిస్తున్నాడు. 'నందిని నర్సింగ్ హోమ్' లాంటి కామెడీ డ్రామాకు దర్శకత్వం వహించిన పీవీ గిరి ఈ సినిమాకు దర్శకత్వం వస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా పూజా ఝవేరి నటిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments