Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మ‌కూరు టు ఒంగోలు ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌క‌టించిన నందమూరి బాలకృష్ణ

Webdunia
శనివారం, 21 మే 2022 (14:33 IST)
Nandamuri Balakrishna
త‌న నాన్న‌గారైన నంద‌మూరి తారక‌రామారావుకు జ‌న్మ‌నిచ్చిన నిమ్మ‌కూరు నుంచి త‌న ప‌ర్య‌ట‌న‌ను బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఎన్‌.టి.ఆర్‌. శతాబ్ది వేడుకల సందర్భంగా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.
 
అభిమానులకు.. తెలుగునేలకు విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..  
నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి….
 
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి  ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది…                                      
 
మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు.  అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను..  వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను  నా చేతులమీద ప్రారంభిస్తున్నాను.. 365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈమహత్కార్యాన్ని  పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను..
                                                                                                                     
 
                                                                                                   అహర్నిశలు మీ అభిమానం కోసం
                                                                                                                                    మీ
                                                                                                                    నందమూరి బాలకృష్ణ.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments