Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు స్టన్నింగ్ లుక్.. యాడ్ కోసమా..? సర్కారు వారి పాట కోసమా?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (13:01 IST)
Mahesh babu
సూపర్ స్టార్ మహేష్ స్టన్నింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు త్వరలో 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వరుసగా హిట్లు అందుకుంటూ మంచి జోష్‌లో ఉన్న మహేష్ బాబ తాజాగా పరశురామ్ దర్శకత్వం వహించే సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట'పై అటు మహేష్ ఫ్యాన్స్‌లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే.. ఇన్నాళ్లు కరోనాతో ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
అయితే మరోవైపు యాడ్స్ చేసుకుంటూ పోతున్నారు మహేష్ బాబు. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం మహేష్ ఫోటో షూట్ చేసాడు. ఈ ఫోటో షూట్ తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. లైట్ గడ్డంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఒక సింపుల్ లుకింగ్ టీషర్ట్‌లో మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదే లుక్ తో సర్కారు వారి పాట చిత్రంలో కూడా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సర్కార్ వారి పాటలో మహేష్ సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తుందని తెలుస్తుంది.

Mahesh babu

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments