Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు పోలీసులు రాకపోతే అంతా అయిపోయేదే... నమిత ఫ్లాష్‌బ్యాక్

ఇటీవలే తిరుపతిలో తన స్నేహితుడిని పెళ్లాడిన నమిత తాజాగా మీడియాతో మాట్లాడారు. తనంటే అభిమానులు వెర్రెత్తిపోవడమూ, కొందరు గుడి కట్టించడంపై ఆమె మాట్లాడుతూ... వారి మనోభావాలను, ప్రేమను తను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. తనకు గుడి కట్టించడం పట్ల వారికి తనపట్ల

Webdunia
శనివారం, 13 జనవరి 2018 (19:25 IST)
ఇటీవలే తిరుపతిలో తన స్నేహితుడిని పెళ్లాడిన నమిత తాజాగా మీడియాతో మాట్లాడారు. తనంటే అభిమానులు వెర్రెత్తిపోవడమూ, కొందరు గుడి కట్టించడంపై ఆమె మాట్లాడుతూ... వారి మనోభావాలను, ప్రేమను తను ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. తనకు గుడి కట్టించడం పట్ల వారికి తనపట్ల వున్న అభిమానం ఎంతటిదో చెప్పలేనని వెల్లడించారు. ఇకపోతే 2009లో ఓ షాకింగ్ ఘటన జరిగినట్లు చెప్పారు.
 
తిరుచ్చిలో ఓ షోలో పాల్గొనేందుకు 2009 అక్టోబరు 23న విమానంలో బయలుదేరి వెళ్లానని వివరించారు. విమానం దిగి బయటకు వెళ్లగానే ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి నేను మీ డ్రైవర్ అని చెప్పడంతో నమ్మేసి కారు ఎక్కాననీ, ఐతే సదరు డ్రైవర్ కారును ఏదేదో రూట్లలో తిప్పుతూ వెళ్తుండేసరికి తనకు అనుమానం వచ్చి ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు తన కోసం ఇంకా విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నట్లు చెప్పారనీ, దాంతో షాక్ తిన్నట్లు చెప్పారు. 
 
పైగా తనను కారులో తీసుకెళ్తున్న డ్రైవరు తననే అద్దంలో నుంచి గమనించడం చూసి భయపడ్డాననీ, ఇంతలో అతడు తనను ఏదో ఓ గోదాములోకి తీసుకెళ్లాడనీ, అక్కడ మరికొందరు వున్నారనీ, అక్కడి వాతావరణం చూస్తే తనను పెళ్లాడేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా వున్నట్లు అర్థమైందన్నారు. ఐతే కారులో ప్రయాణిస్తూనే విషయాన్నంతా ఆర్గనైజర్లకు చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తనను రక్షించినట్లు చెప్పారు. ఆ రోజు పోలీసులు రాకుండా వుంటే బలవంతంగా అతడెవరో పెళ్లి చేసుకునేవాడేననీ ఆమె గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ గాడ్.... సరైన సమయంలో తనను పోలీసులు రక్షించారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments