Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడుపై కన్నుపడిన కన్నడభామ... నాగ్‌ను అలా చూసి రష్మిక ఇంప్రెస్...

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (08:07 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునపై కన్నడభామ రష్మిక మందన్నాకు కన్నుపడింది. నాగార్జున వ్యాయామం (పుష్ అప్స్) చేస్తుండగా రష్మిక చూసి ఇంప్రెస్ అయ్యారు. పైగా, అలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
నాగార్జున - దియా మిర్జా జంటగా నటించిన చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు 'వైల్డ్‌ డాగ్'‌ పుష్‌‌అప్‌ ఛాలెంజ్‌ హల్‌చల్‌ చేస్తోంది. 
 
ఈ క్రమంలో సోష‌ల్ ‌మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే క‌న్న‌డ భామ ర‌ష్మిక మందన్నాకు ఈ ఛాలెంజ్‌పై కన్ను పడింది. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లే ఈ బ్యూటీ సవాల్‌ను స్వీకరించింది. కొన్ని సెకన్ల పాటు పుష్‌అప్‌ పొజిషన్‌లో ఉండి దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది.
 
రష్మిక వీడియోను టాలీవుడ్‌ స్టార్ నాగార్జున చూశారు. ఆయన కూడా పుష్‌అప్‌ పొజిషన్‌లో చాలా సేపు ఉన్నారు. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్‌ విసిరారు. 'యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్'‌ అంటూ తన పోస్ట్‌కి ఆమె ఖాతాను ట్యాగ్‌ చేశారు. ఆయన చేసిన పుష్‌ అప్ వీడియో‌ని కూడా జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments