Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్ ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వ‌చ్చేస్తుంది

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:58 IST)
Nagarjuna, Sonal Chauhan
కింగ్ అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల భారీ యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
ఇప్పుడు ది ఘోస్ట్  ఆడియో ప్రమోషన్‌ లకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్
 
భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్,  రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.
సాంగ్ రిలీజ్ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో కలిసి సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. నాగార్జున,  సోనాల్ ని ప్రేమగా దగ్గరగా తీసుకొని చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆమె అతని కౌగిలింత ముద్దులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్లు పోస్టర్ లవ్లీగా వుంది. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. 
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా,  బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments