Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవ‌దాస్‌కి సెంటిమెంట్ క‌లిసొచ్చేనా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ చిత్రానికి శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకు

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (21:52 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. ఈ చిత్రానికి శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే.. సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ట‌. 
 
ఇంత‌కీ ఆ కార‌ణం ఏంటంటే... దాదాపు 24 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా నటించిన శుభలగ్నం సెప్టెంబర్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే దాదాపు పదిహేడేళ్ల క్రితం ఎన్టీఆర్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అశ్వనీదత్‌ ఒక నిర్మాతగా తెరకెక్కిన స్టూడెంట్‌ నెం.1 చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదలై, ఘ‌న విజ‌యం సాధించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన రామ్‌చరణ్ తొలి చిత్రం చిరుత కూడా సెప్టెంబర్‌ 28న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 
 
ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 27న భారీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌ రిలీజ్ చేస్తున్నార‌ట‌. మ‌రి.. ఈసారి కూడా ఈ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments