Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్దీవుల్లో హాయిగా విహరిస్తోన్న చైతూ సామ్.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:13 IST)
Nagachaitanya
నాగచైతన్య, సమంత జంట మాల్దీవుల్లో హాయిగా విహరిస్తోంది. చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇన్‌స్టా వేదికగా భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సామ్‌. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. 
 
సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96'ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. 
 
ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భర్త నాగ చైతన్య ఈరోజు 34పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 
 
ఈ సందర్భంగా ఈ జంట ప్రస్తుతం మాల్దీవ్స్‌లో సెలెబ్రేట్ చేసుకుంటుంది. అందులో భాగంగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. భార్యాభర్తలు మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త!

మీరెక్కాల్సిన బస్సు ఇది కాదు అది అంటూ ఏసీ బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments