నీహారిక భర్త, నాగబాబు అల్లుడు చైతన్య వుంటున్న ప్లాట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. గురువారం సాయంత్రమే ఆయన తన ప్లాట్‌ను ఈనెల 10న ఖాళీ చేయనున్నట్లు ఇంటి యజమానికి తెలియజేశారు. అసలు విషయానికి వస్తే, చైతన్య తండ్రి ఓ ఉన్నత పోలీసు అధికారి. సరిగ్గా ఆయన పెళ్లికి వారం రోజుల ముందే రిటైర్ అయ్యారు. ఇక నాగబాబు గురించి తెలిసిందే. సినిమా రంగంలో మెగాఫ్యామిలీ.
అసలు ఏం జరిగిందంటే-
షేక్‌పేటలో వుండే టాన్సికా అపార్ట్‌మెంట్. ఇది మంచి రిచ్ అపార్ట్‌మెంట్. ఇక్కడ ప్రముఖ పార్టీకి చెందిన నాయకులు బంధువులు కూడా నివశిస్తున్నారు. తన అపార్ట్‌మెంట్‌లో రాత్రిపూట అక్రమంగా అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌కు చెందినవారు ప్రవేశించారని చైతన్య కేసు పెట్టారు. అసలు చైతన్య సినిమా వ్యాపారం చేసుకోవడానికి సంబంధించిన ఆఫీసు ఇది తమకు తెలియని అసోసియేషన్ వారు ఎస్.ఐ. శివచంద్రకు తెలిపారు. కానీ ఇంటి ఓనర్ ఇక్కడ వుండడు. ఆయనకు మాత్రం ఇది ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఆఫీసు కోసమే తీసుకుంటున్నట్లు చెప్పినట్లు చైతన్య వీడియో కూడా చూపించాడు.
దాంతో ఇరువర్గాలను శాంతి చర్చల పేరుతో రాజీ కుదిర్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు చైతన్య తండ్రి పోలీసు ఉన్నతాధికారి అయినా, అసోసియేషన్ సెక్రటరీ మాత్రం ప్రధాన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పొలిటికల్‌గా ఒత్తిడి వచ్చిందని పోలీసులు అక్కడివారితో తెలియజేశారు. అందుకే చైతన్య ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక `మా` ఎన్నికలు కూడా దగ్గరపడడంతో ఇది నాగబాబుకు తలనొప్పిగా మారుతుందని కూడా మెగా ఫ్యామిలీ భావించి వుండవచ్చని కూడా అనుకుంటున్నారు.