Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్- నిహారికకు పెళ్లా? ఏ దరిద్రుడో క్రియేట్ చేసి వుంటాడు: నాగబాబు

మెగా హీరో సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక‌లకు త్వరలో వివాహం జరుగనుందనే వార్తలపై సాయిధరమ్ తేజ్ స్పందించిన సంగతి తెలిసిందే. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని స్పష్టం చేశాడు. తాజాగా సినీ నటుడ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:49 IST)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక‌లకు త్వరలో వివాహం జరుగనుందనే వార్తలపై సాయిధరమ్ తేజ్ స్పందించిన సంగతి తెలిసిందే. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని స్పష్టం చేశాడు. తాజాగా సినీ నటుడు, మెగా సోదరుడు నాగబాబు తనదైన శైలిలో సాయి, నిహారికల పెళ్లి వార్తపై స్పందించారు.

సాయిధరమ్ తేజ్-నిహారిక కుటుంబాల మధ్య పెళ్ళి మాటలు జరుగుతున్నాయనే వార్తలపై నాగబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. అదొక ఫూలిష్ న్యూస్ అని చెప్పారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పుకొచ్చారు. నిహారికను తేజు ఎత్తుకుని తిరిగేవాడనీ.. వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. 
 
మెగా ప్రిన్స్, తన వారసుడైన వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.... హీరో అవుతానంటే ఎంకరేజ్ చేశానని తెలిపారు. మూడేళ్ల ప్రయాణంలో కొన్ని మంచి సినిమాలు చేశానని.. వరుణ్ కెరీర్‌లో ఫిదా తొలి బ్లాక్ బస్టర్ అని నాగబాబు అన్నారు. ఇక జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో బూతులున్నాయంటూ వస్తున్న వార్తపై నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జబర్దస్త్ మీద వల్గారిటీ, బూతు అనే ఆరోపణలను తాను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. సమాజాన్ని నాశనం చేసేంత తప్పుడు పనులేమీ చేయడం లేదని నాగబాబు ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments