Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ శౌర్య హీరోగా నూత‌న చిత్రం ప్రారంభం

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (16:10 IST)
Naga Shaurya movie opeing
నాగశౌర్య కథానాయకుడిగా,  నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్సకత్వంలో నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతోంది. ముహూర్తం షాట్‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.
 
ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. పవన్ బాసంశెట్టి  యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  
 
ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగ చైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
 
సాంకేతిక విభాగం: దర్శకత్వం - పవన్ బాసంశెట్టి, కెమెరా- వంశీ పచ్చిపులుసు,  సంగీతం - పవన్ సిహెచ్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ ఎస్ ప్రకాష్,  ఎడిటర్ - కార్తీక్ శ్రీనివాస్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి,  బ్యానర్ - శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నిర్మాత: చెరుకూరి సుధాకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments