Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ ఎమోషనల్ పోస్ట్.. సమంతతో పెంచిన హ్యాష్‌కు థాంక్యూ

Webdunia
గురువారం, 7 జులై 2022 (13:30 IST)
అక్కినేని హీరో నాగచైతన్య ఎమోషనల్ పోస్టు వైరల్ అవుతోంది. చైతూ లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'. ఈ నెల (జులై) 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాశీ ఖన్నా  హీరోయిన్ గా నటిస్తోన్న థాంక్యూ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, -శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా థ్యాంక్యూ మూవీ  ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ  పోస్ట్ పెట్టాడు. 
 
nagachaitanya
 
తనకు అత్యంత ముఖ్యమైన వారికి థాంక్యూ చెప్పాడు. "థాంక్యూ అనే పదాన్ని  ఎక్కువగా వాడుతుంటా.. ఈ ఆలోచనకు థాంక్యూ చిత్రం కారణం. ఈ మూవీ జర్నీ నన్ను కదిలించింది " అంటూ తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు అంకితం ఇస్తున్నట్లుగా తెలిపాడు. 
 
ఈ పోస్ట్ లో తన తల్లిదండ్రులైన నాగార్జున, లక్ష్మి దగ్గుబాటి తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫోటోలను అందులో షేర్ చేశాడు.
 
'అన్ని విషయాల్లో నాకు సపోర్ట్‌ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్‌', 'నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు నాన్నకు 'థ్యాంక్స్ 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్‌ హ్యాష్‌' అంటూ ఎమోషనల్‌‌గా రాసుకొచ్చాడు. 
 
కాగా 2017లో వివాహమైన తర్వాత సామ్.. చైతన్య హ్యాష్‌ను పెంచుకుంటున్నారు. హ్యాష్ ఫోటోలను గతంలో సమంత కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 



గత ఏడాది సమంత- చైతన్య విడిపోయిన తర్వాత హ్యాష్ సామ్ వద్దే వుంది. ఈ క్రమంలోనే చైతూ చేసిన పోస్టు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments