నాగ చైతన్య అక్కినేని డెబ్యూ సిరీస్ ధూత ప్రైమ్ వీడియోలో రాబోతుంది

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (16:15 IST)
Naga Chaitanya
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన సిరిస్ 'ధూత'.  సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య అక్కినేని ప్రధాన పాత్ర పోషించారు.  పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్,  ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
 
ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని  ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి  ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.
 
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. Ltd నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. "ధూత అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సిరీస్‌లలో ఒకటి.  ఎంతో కాలం శ్రమ, అపారమైన అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం. మొదటి నుంచీ, దర్శకుడు విక్రమ్ ఊహించినంత లోతుగా, వివరంగా ఒక కాన్సెప్ట్, కథ పూర్తి సామర్థ్యాన్ని చూపించే విధంగా సిరిస్ ని మలచాలని ముందే అనుకున్నాం. ధూత నాగచైతన్యకు గొప్ప స్ట్రీమింగ్ అరంగేట్రం అవుతుంది. ఈ విషయంలో మాకు ఎంతో ఆనందంగా వుంది. ముగ్గురు అసాధారణ మహిళా కథానాయకులు ఇందులో చాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరిస్ తో  మునుపెన్నడూ లేని విధంగా, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ లు, అనూహ్యమైన కథనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న ప్రైమ్ వీడియోకు ధన్యవాదాలు'' తెలిపారు.
 
తారాగణం:  నాగ చైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్,  ప్రాచీ దేశాయ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం - ఏపీకి పొంచివున్న తుఫానుల గండం

56 మంది పురుషులు - 20 మంది మహిళలతో రేవ్ పార్టీ ... ఎక్కడ?

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

Google To AP: విశాఖలో గూగుల్ 1-జీడబ్ల్యూ డేటా సెంటర్‌.. ఆ ఘనత బాబు, లోకేష్‌ది కాదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments