Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నో విషయాలు ఆయన్ను చూసి నేర్చుకున్నాం : శివాని రాజశేఖర్

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (16:02 IST)
Shivani Rajasekhar
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో శ్రీకాంత్,  వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’.  ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2  బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియా మిత్రులతో ఈ విధంగా ముచ్చటించారు.
 
ఈ ప్రాజెక్టులో మీరు ఎలా భాగమయ్యారు ?
'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్ లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో  ట్రైబల్ అమ్మాయి  పాత్ర పోషించాను. ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్  కూడా నేర్చుకున్నా.
 
ఈ సినిమా ఒరిజినల్ నాయట్టు చూసారా?
ఈ ఆఫర్ వచ్చిన తర్వాత ఒరిజినల్ వెర్షన్ చూశాను. విలేజ్ లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాను. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. అలాగే నాన్నగారు చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో వారి నుంచి తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా విషయంలో నా గెటప్ కోసం నాన్నగారు కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు.
 
లింగిడి లింగిడి సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు?
ఈ పాట ఇంత వైరల్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఆర్టిస్ట్ కి తన సినిమా బాగుండాలి.. సినిమాలోని పాటలు సక్సెస్ అవ్వాలని కోరిక ఉంటుంది.  నాకు ఈ పాటతో ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఈ సాంగ్ వల్ల నాకు మరింత గుర్తింపు వచ్చింది.  ఎక్కడికి వెళ్లినా ఈ పాట గురించే మాట్లాడుతున్నారు. అసలు లింగిడి పాట వల్లే కోటబొమ్మాలి సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇంతలా ఈ పాటను జనాల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ కి స్పెషల్ థాంక్స్.
 
ఒరిజినల్ వెర్షన్ లోని పాత్ర మీపై ఎలా ప్రభావితం చేస్తుంది?
ఒరిజినల్ క్యారెక్టర్స్ తో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. సినిమాగా చూసి వదిలేస్తాను అంతే తప్ప వారిని ఫాలో అవ్వను ఎందుకంటే.. ఇమిటేషన్ ఉండకూడదని అనుకుంటా. అయినా ఆ చిత్రానికి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఒరిజినల్ చూసినవారు కూడా ఈ సినిమాను ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అలా అని ఒరిజినల్ సోల్ కు ఏ మాత్రం తక్కువ ఉండదు.
 
రీమేక్ చేయడం ఛాలెంజింగ్  కదా..కంపేరిజన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ చిత్రాన్ని మా టీమ్ అంతా ముందు నుంచి రీమేక్ అని నమ్మలేదు.  ఆ పాయింట్ తప్ప మిగతా సినిమా అంతా  మార్పులు చేశారు.
 
గ్లామరస్ పాత్ర కాకపోయినా  ఈ సినిమా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నారు?
నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు.  మనం ఎంత ఆలోచించినా జరగాల్సిందే జరుగుతుందనే విషయం నాకు బాగా అర్థమైంది. చిన్నప్పటినుంచి అమ్మానాన్నను చూసి పెరగడం కూడా మాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతాం. నచ్చింది చేసుకుంటూ పోవడాన్ని నేను నమ్ముతాను రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కమర్షియల్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా.
 
కొత్త కథలు వచ్చినప్పుడు అమ్మానాన్నల సలహాలు తీసుకుంటారా?
నా కథల విషయంలో గానీ శివాత్మిక కథల విషయంలో గానీ వాళ్లు జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది. వాళ్ళు ఎప్పుడూ మా కథలు వినలేదు. చివరి నిర్ణయం మాకే వదిలేస్తారు.
 
శ్రీకాంత్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?
శ్రీకాంత్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ గా,  డాడీ కి కొలీగ్ మాకు తెలుసు. ఫస్ట్ టైం ఆయనతో  వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్.  ఆయన చాలా జోవియల్ యాక్టర్. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను, రాహుల్ చాలా విషయాలు నేర్చుకున్నాం. దర్శకుడికి గౌరవం ఇవ్వడం, టైం కి సెట్ కి రావడం లాంటివి ఎన్నో విషయాలు ఆయన్ను చూసి నేర్చుకున్నాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారి పాత్ర హైలెట్ గా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments