Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ స్కిట్.. నేను హెచ్చరిస్తూనే ఉంటా: నాగబాబు

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా వెండితెరకు కమెడియన్లు లభించినట్లే అయ్యింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జబర్ధస్త్ కామెడీ టీమ్ మంచి కమెడియన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంత ఆదరణ పొం

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:16 IST)
జబర్ధస్త్ కామెడీ షో ద్వారా వెండితెరకు కమెడియన్లు లభించినట్లే అయ్యింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జబర్ధస్త్ కామెడీ టీమ్ మంచి కమెడియన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంత ఆదరణ పొందుతుంతో.. అంతే విమర్శలకు గురి అవుతుంది. గతంలో ఈ ప్రోగ్రామ్‌లో అసభ్యకరమైన స్కిట్‌లు చేసి జనాల చేత తన్నులు తిన్న సందర్భాలు లేకపోలేదు. ఈ షో మీద ఎన్ని విమర్శలొచ్చినా.. 'జబర్ధస్త్' కామెడీ షో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 
 
తాజాగా ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లో వస్తున్న అసభ్య కామెడీపై స్పందిచారు. కామెడీలో వందకు పైగా రకాలున్నాయని అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమన్నారు. జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ స్కిట్‌లతో పాటుగా నీట్‌గా ఉండే స్కిట్‌లు కూడా ఉన్నాయని అన్నారు. 
 
కొన్ని సందర్భాల్లో వాళ్ల డైలాగ్స్‌లో డబుల్ మీనింగ్ వస్తే నేను హెచ్చరిస్తూనే ఉంటానని వెంటనే వారు సరిచేసుకుంటారని నాగబాబు వ్యాఖ్యానించారు. నిజానికి మొదట్లో ఈ ప్రోగ్రామ్‌ను పది ఎపిసోడ్‌లు మాత్రమే చెద్దామనుకున్నారని, అయితే చాలా విజయవంతమైందని తెలిపారు. ఇది ఒక అద్భుతం అని, ఇలాంటి దానిలో భాగం అవ్వడం తమ అదృష్టమని నాగబాబు అన్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ పెరుగుతుందని, గురు శుక్ర వారాలు వచ్చాయంటే సినిమాలకు కూడా వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారన్నారు. 
 
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ తాను మా అన్న చిరంజీవిపై ఆధారపడి బ్రతుకుతున్నానని అన్నారని, అందుకు తాను ఒప్పుకుంటున్నానన్నారు. నేను మా అన్నపై ఆధారపడి బ్రతుకుతున్నాను, కానీ ఊరోళ్లమీద పడి బ్రతకడం లేదు కదా అంటూ నవ్వుతూ చెప్పారు.
 
వర్మగారి ఆ మాటలకు తనకు చాలా సంతోషమే అన్నారు. ఆ వ్యాఖ్యలను తాను చదివినప్పుడు నవ్వుకున్నానని చెప్పారు నాగబాబు. అన్నయ్యతో పోల్చుకుంటే తాను ఏమీ కాదని, మీ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. తనను ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకోనన్నారు. అయితే తన అన్న చిరంజీవిని అంటే మాత్రం బ్యాలెన్స్ కోల్పోతానని అది తన వీక్‌నెస్ అని అన్నారు.
 
ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యండమూరి వీరేంద్రనాథ్‌పై చేసిన వ్యాఖ్యలకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడాలనుకున్న ప్రతిదానికీ సమాధానమివ్వగలనని అన్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారిని గురువులా గౌరవిస్తానని, ఇప్పటికీ తన మనసులో ఆయనకు అదే స్థానం ఉందని చెప్పారు. మా అన్న ఫ్యామిలీని అన్నారనే బాధతోనే అలా స్పందించానని, తప్పితే ఆయనపై తనకు ఎలాంటి విద్వేషం లేదని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments