Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. మా అన్నయ్య వద్దే అడుక్కుంటున్నా.. ఊరోళ్లమీద పడి బ్రతకడం లేదు కదా? నాగబాబు

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ తాను మా అన్న చిరంజీవిపై ఆధారపడి బ్రతుకుతున్నానని అన్నారని

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (11:08 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ తాను మా అన్న చిరంజీవిపై ఆధారపడి బ్రతుకుతున్నానని అన్నారని, అందుకు తాను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. మా అన్నయ్యే నాకు ఆధారం.. ఆయన వద్దే అడుక్కుంటున్నాను. ఇందులో తప్పేముంది.. బయటవాళ్లపై ఆధారపడలేదు కదా అని ప్రశ్నించారు. 
 
అవును నేను మా అన్నపై ఆధారపడి బ్రతుకుతున్నాను, కానీ ఊరోళ్లమీద పడి బ్రతకడం లేదు కదా అంటూ నవ్వుతూ చెప్పారు. వర్మగారి ఆ మాటలకు తనకు చాలా సంతోషమే అన్నారు. ఆ వ్యాఖ్యలను తాను చదివినప్పుడు నవ్వుకున్నానని చెప్పారు. అన్నయ్యతో పోల్చుకుంటే తాను ఏమీ కాదని, మీ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. తనను ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకోనన్నారు. అయితే తన అన్న చిరంజీవిని అంటే మాత్రం బ్యాలెన్స్ కోల్పోతానని అది తన వీక్‌నెస్ అని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు.
 
"ఖైదీ నెంబర్ 150" ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో వర్మపై చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... తాను ఆరోజు కావాలనే మాట్లాడినట్టు చెప్పారు. తమ మీద పలువురు రాళ్లు వేసినప్పుడు తాము కూడా ఒక రాయి వేయాలని లేకపోతే అది తప్పు అవుతుందని చెప్పారు. తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్‌ను ఎవరైనా అంటే తాను ఇలానే స్పందిస్తానని అన్నారు. వర్మ చాలా గొప్ప దర్శకులని, తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప పాఠం నేర్పాడని అన్నారు.
 
అయితే గత ఐదారేళ్ల నుంచి ఆయన మెగా ఫ్యామిలీని కెలుకుతుండటం చేశారని అన్నారు. గబ్బర్ సింగ్ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని అనడం తప్పు అని అన్నారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ ఈ గెటప్‌ను జేమ్స్ కామరూన్ చూస్తే ఆశ్చర్యపోతాడని వెటకారం చేయడం సరికాదని అన్నారు. తమ ముగ్గురు అన్నదమ్ముల్లో వర్మగారిని ఎవరూ, ఎప్పుడూ ఏమీ అనలేదని నాగబాబు గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments