''క్రాక్''తో మళ్లీ ఫామ్‌లోకి శృతి హాసన్... నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్‌లో అదరగొడుతుందట!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (21:30 IST)
shruti haasan
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న క్రాక్‌లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది.  
 
రవితేజ 'డిస్కో రాజా'తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి. అయితే రవితేజతో మరోసినిమాలో కూడా శృతి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఈ సినిమా తర్వాత ఖిలాడీ అనే సినిమా చేయనున్నాడు. దీని తర్వాత ఓ ఎంటర్ టైనర్‌ను నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో చేస్తున్నాడు. 
 
ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుందట.
 
ఇక శృతిహాసన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇటు సినిమాలు చేస్తూనే.. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో సైలెంట్ గా ఓ క్లాస్ హిట్ ను అందుకున్నా నాగ్ అశ్విన్.. ఆ సినిమా హిట్ తరువాత 'మహానటి' చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్నాడు. 
 
నాగ్ అశ్విన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీని అనౌన్స్ చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా.. హాట్ టాపిక్ గా మారాడు. అయితే ప్రభాస్ ప్రస్తుత సినిమాల వల్ల కొంత గ్యాప్ దొరకడంతో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడట నాగ్ అశ్విన్. 
 
ఈ వెబ్ సిరీస్‌ దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉంటుందట. శృతిహాసన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ ఫిల్మ్ హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్‌కు తెలుగు రీమేక్ అని సమాచారం. దీనితో పాటు రానాతో కలిసి ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో శృతి హాసన్ నటించనుంది. ఈ వెబ్‌సిరీస్ కోసం ప్రముఖ తెలుగు దర్శకుడు కథను అదించారని, నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించబోతోందని సమాచారం అందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments