Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సామిరంగ లో చాలా సర్ప్రైజ్ లున్నాయి : దర్శకుడు విజయ్ బిన్ని

డీవీ
శనివారం, 6 జనవరి 2024 (17:09 IST)
Director Vijay Binni
దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చాను. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూసిన తర్వాత అన్నీ క్రాఫ్ట్స్ బాగా చేశారు,  కొరియోగ్రాఫర్ కి ఆ గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్ళు కొరియోగ్రఫీ వైపు వెళ్లాను. ఇంతకుముందు నాగార్జున గారికి పాటలు చేశాను. సినిమా కూడా చాలా హ్యాపీ గా చేసుకుంటూ వెళ్లాం. దర్శకుడిగా తొలి సినిమాని నాగార్జున గారితో చేయడం నా అదృష్టం అని 'నా సామిరంగ'  డైరెక్టర్ విజయ్ బిన్ని అన్నారు. జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నా సామిరంగ దర్శకుడు విజయ్ బిన్ని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
 
ఈ సినిమా నేపధ్యం ఏమిటి ?
-స్నేహం, మంచి ప్రేమకథ, చాలా మంచి ఎమోషన్ వుంటాయి. 80-90 మధ్య కాలంలో జరిగే కథ ఇది.
 
నా సామిరంగ టైటిల్ ఆలోచన ఎవరిది ?
-నా సామిరంగా ఏఎన్ఆర్ గారి సినిమాలో ప్రజాధరణ పొందిన పాట. అది టైటిల్ అయితే బావుంటుందని అందరం కలసి తీసుకున్న నిర్ణయం ఇది.
 
ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-ముందు నాగార్జున గారితో ఒక సినిమా చేయాలని ఆయనకి కథ చెప్పాను. అప్పుడు ఆయన ఈ కథ గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఈ కథని వోన్ చేసుకొని నా స్టయిల్ లో చేశాను. ఈ సినిమాలో చాలా హైస్ వుంటాయి. వింటేజ్ నాగార్జున గారు కనిపిస్తారు.  నేను నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపించాలని అనుకున్నానో అంత కొత్తగా ప్రజెంట్ చేశానని భావిస్తున్నాను.
 
అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రల గురించి ?
-ఇదొక ఫ్రెండ్షిప్ మూవీ. నరేష్ గారికి నాగార్జున గారంటే పిచ్చి. వారిద్దరిని ఈ కథలో పెడితే బావుంటుందనిపించింది. నరేష్ గారు అద్భుతంగా చేశారు, వీరితో పాటు మరో యంగ్ యాక్టర్ వుండాలి. ఆ పాత్రకు రాజ్ తరుణ్ ని తీసుకున్నాం. ఇందులో ముగ్గురికి ఒకొక్క కథ వుంటుంది. ఈ కథలు ఎలా కనెక్ట్ అయి వున్నాయి? వాళ్ళ మధ్య జరిగిన సిస్ట్యువేషన్స్ ఏమిటనేది చాలా కొత్తగా వుంటాయి.
 
మీ వర్క్ పట్ల నాగార్జున గారు ఎంత హ్యాపీగా వున్నారు ?
-నాగార్జున గారు చాలా హ్యాపీగా వున్నారు.  ఆయన ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అందులో నా ప్రత్యేకత ఎమిటనేది నాగార్జున గారు చెబితేనే బావుటుంది. ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే సినిమాని ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ సినిమాతో నేర్చుకున్నాను. నాగార్జున గారు, నరేష్ గారు రాజ్ తరుణ్ అద్భుతంగా సపోర్ట్ చేశారు.
 
ఇందులో ఐటెం సాంగ్ సర్ ప్రైజ్ వుందని విన్నాం ?
-చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. అవన్నీ తెరపై చూడాల్సిందే. 
 
ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత కీరవాణి చేసిన చిత్రమిది.. తొలి సినిమా దర్శకుడిగా ఆయనతో పని చేసిన మీ అనుభవం ?
-కీరవాణి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ కొత్త దర్శకుడిలా చూడలేదు. నేను కోరియోగ్రఫర్ ని కాబట్టి మ్యూజిక్ సెన్స్ వుంటుంది. ఆయనకి ఏదైనా చెప్పినా ఒక సెన్స్ తోనే చెబుతుంటాడని భావించేవారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోయే మూడు పాటలు కూడా వైరల్ అవుతాయి.
 
ఈ సినిమా కోసం చాలా ఫాస్ట్ గా పని చేశారు కదా.. ఎక్కడ ఒత్తిడి అనిపించలేదా ?
-డైరెక్టర్ కావడం నా డ్రీం. ఆ డ్రీం కోసం చాలా కష్టపడ్డాను. సరైన సమయంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. కమర్షియల్ లోనే నా సొంత స్టైల్ ని ప్రయత్నించాను. అది ఖచ్చితంగా యూనిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

సజ్జల భార్గవ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి: వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments