ఎన్‌.టి.ఆర్‌. బర్త్‌డే సందర్భంగా దేవర టైటిల్‌ తో పాటు లుక్ వచ్చేసింది

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (19:52 IST)
NTR llok
గత కొద్దిరోజులుగా ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌ నటిస్తున్న సినిమాకు దేవర అనే టైటిల్‌ రానున్నదని సోషల్‌ మీడియాలో వార్త వచ్చింది. దానికి అనుగుణంగానే ట్విట్టర్‌లో రోజుకొకి అప్‌డేట్‌ పోస్టర్‌తో అభిమానులను ఉర్రూతలూరించారు. కత్తులతో పోస్టర్‌లను చూపిస్తూ భారీ యాక్షన్‌ సినిమాగా చూపించేశారు. ఈ కథ సముద్రంలో జరిగే దొంగలతో జాలరికి చెందిన ఓ వ్యక్తి చేసే పోరాటంగా దర్శకుడు కొరటాల శివ చెప్పకనే చెప్పేశాడు.
 
రేపు అనగా మే 20న ఎన్‌టిఆర్‌. జన్మదినం. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 7గంటల తర్వాత టైటిల్‌ను ఖరారుచేస్తూ ఎన్‌.టి.ఆర్‌. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సముద్రంలోని రాళ్ల దగ్గర గండ్ర గొడ్డలి లాంటి కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న ఎన్‌.టి.ఆర్‌. స్టిల్ ను పోస్ట్ చేశారు. 

జాహ్నవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. యాక్షన్‌ పరంగా అనుభజ్ఞులైన యాక్షన్‌ కొరియోగ్రాఫర్లతో అందులోనూ హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది 5.4.2204న సినిమా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో చెప్పేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments