Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక న‌టించిన మై నేమ్‌ ఈజ్‌ శృతి టీజర్ వ‌చ్చేసింది

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (19:27 IST)
My Name Is Shruti preessmeet
ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి  ఆర్గాన్ మాఫియా గురించి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్న సస్పెన్స్ ఏంక్వైరీ  థ్రిల్లర్ "మై నేమ్‌ ఈజ్‌ శృతి’  ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి. డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’(ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక) చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర  ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై తీసిన "మై నేమ్‌ ఈజ్‌ శృతి’ టీజర్ బాగుంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.ఎందుకంటే క్రైమ్ కు సంబంధించిన మెసేజ్ ఓరియెంటెడ్ వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ కి పరిచయమవుతున్న మిత్రుడు బురుగు రమ్య ప్రభాకర్ గౌడ్, దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ లు ఈ కథను చాలెంజ్ గా తీసుకొని చేస్తున్నారు. ఈ రోజు ట్యాలెంట్ అనేది సమాజంలో పెరిగిపోయింది.   అలాగే ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు, నటీనటులకు,టెక్నిసిషన్స్ లకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి" చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 
 
హీరోయిన్  హన్సిక మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్ విడుదలకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.2022 లో విడుదవుతున్న ఈ చిత్రం చాలా బాగుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆన్నారు. 
 
చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌.మాట్లాడుతూ: మేము మినిస్టర్ ను కలసి టీజర్ విడుదలకు రమ్మని పిలవగానే తనను తిరుపతి వెళ్లే కార్యక్రమం వున్నా..మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. ముంబై లో ఉన్న హన్సిక అపార్ట్ మెంట్ లో 75 కోవిడ్ కేసులు వున్నా కూడా అక్కడ అందరి పర్మిషన్ తీసుకొని మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన హన్సిక కు ధన్యవాదాలు.చిన్న సినిమా తీద్దామని టిపికల్ పాయింట్ ను తీసుకుని నిర్మాతకు ఈ కథ చెప్పిన వెంటనే రిస్క్ అయినా పర్వాలేదు ఈ సినిమా చేద్దామంటూ సినిమాకు కావలసిన పెద్ద ప్యాడింగ్ ను కూడా తీసుకొని పెద్ద సినిమా చేద్దామని సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. 
 
నిర్మాత ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతో బిజీ ఉన్నా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన తలసాని ఆన్నగారికి ధన్యవాదాలు. హన్సిక గా వుండే ఏరియాలో కంటోన్మెంట్ జోన్ వున్నా కూడా తను రావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది.ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాకు ఏ కథ చెప్పాడో  అదే చాలా చక్కగా తీశాడు. నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ డెడికేటెడ్ గా ఓన్ మూవీ గా వర్క్ చేయడంతో సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము.ఈ ఆడియోను టిప్స్ ద్వారా విడుదల చేస్తున్నాము అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments