Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ పరిశ్రమ మరింత పుంజుకోవాలని టికెట్ రేట్స్ పెంచాం: తెలంగాణ మంత్రి త‌ల‌సాని

సినీ పరిశ్రమ మరింత పుంజుకోవాలని టికెట్ రేట్స్ పెంచాం: తెలంగాణ మంత్రి త‌ల‌సాని
, బుధవారం, 12 జనవరి 2022 (19:24 IST)
Talasani Srinivasa Yadav
సినిమా ప‌రిశ్ర‌మ‌లోని క‌ష్టన‌ష్టాలు తెలుసు క‌నుక‌నే తెలంగాణ ప్ర‌భుత్వం వారికి ఫేవ‌ర్‌గా టిక్క‌ట్ల రేట్లు పెంచింద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ అన్నారు.

 
ఆయ‌న బుధవారంనాడు సినీ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్త తరం, కొత్త యంగ్‌స్టర్స్ నటీనటులు, టెక్నీషియన్స్ వంటి ట్యాలెంట్ ఉన్న ఎంతోమంది తిరుగుతున్నారు. వారంతా చిత్ర పరిశ్రమకు  రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అఖండ, పుష్ప సినిమాలు వచ్చి కొంత పుంజుకోవడం జరిగింది. అలాగే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి.

అందుకే చిత్ర పరిశ్రమ మరింత పుంజుకోవాలని ఈ మధ్య టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. చిన్న సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది. అలాగే థియేటర్స్ ఇబ్బందుల విషయం కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీ దేశంలోనే ఒక హబ్‌గా ఉండాలనేదే మా ఆకాంక్ష. అలాగే లొకేషన్స్‌లో పర్మిషన్ తీసుకోవటానికి సినిమా నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దానికి సంబంధించిన సింగిల్ విండోను కూడా ఒకే చేశాము. సినిమాకు కులం మతం, ప్రాంతం అనేది ఉండదు.

 
సినిమా అనేది ప్రజలకు వినోదాన్నిస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. కాబట్టి సినిమా ప్రతి ఒక్కరికి అవసరం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను ప్రభుత్వం నిమిషాల మీద నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇందుకు మీడియా కూడా సహకరించాలి. ఎందుకంటే సినీ పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి వున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే అంశాలు చూపిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఈరోజు సినిమా అనేది ఈ దేశంలో నెంబర్ వన్ స్థానంలో మన హైదరాబాద్ ఉంది. ఇంకా రాబోయే కాలంలో సినిమాకు సంబంధించిన మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాన‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచ్చం నేను అఘోరాలా వుంటేనా? టిక్క‌ట్ల రేట్ల గురించి బాల‌కృష్ణ చెప్పిన కీల‌క స‌మాధానాలు