Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త నన్ను చంపాలని చూస్తున్నాడు... నటి పూజిత: పెళ్లి చేస్కోలేదు కానీ మా ఇద్దరికీ కొడుకు పుట్టాడు... విజయ్

బుల్లితెర నటి పూజిత మీడియా ముందుకు వచ్చింది. తన భర్త విజయ్ గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడనీ, ఇప్పుడు తనను హత్య చేసేందుకు పథకరచన చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త తనను హత్య చేసేందుకు చూస్

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:10 IST)
బుల్లితెర నటి పూజిత మీడియా ముందుకు వచ్చింది. తన భర్త విజయ్ గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడనీ, ఇప్పుడు తనను హత్య చేసేందుకు పథకరచన చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త తనను హత్య చేసేందుకు చూస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిటీ కమిషన్ మహేందర్ రెడ్డి తగిన ఆధారాలతో రమ్మన్నట్లు ఆమె తెలిపారు. దాంతో అన్ని ఆధారాలను ఆయనకు అందించినట్లు ఆమె తెలిపారు. తన భర్తపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయనీ, అందువల్ల అతడి కారణంగా తనకు ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆమె మీడియా ముందు వెల్లడించారు.
 
ఇదిలావుంటే విజయ్ గోపాల్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ... అసలు పూజితను తను పెళ్లాడలేదని తెలిపాడు. ఆమెతో 12 ఏళ్లు స‌హ‌జీవ‌నం మాత్రం చేశానని చెప్పుకొచ్చాడు. డేటింగ్ చేస్తున్న సమయంలో తమకు ఓ అబ్బాయి పుట్టాడని పేర్కొన్నాడు. ఐతే గత ఏడేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. ఏడేళ్లుగా దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు తనపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నదో తనకు అర్థం కావడంలేదని అంటున్నాడు. రేఖారాణి కూడా ఈ విషయాన్ని ఖండించారు. పూజిత పెళ్లి చేసుకున్నట్లు నిరూపిస్తే ఆమెకు బాసటగా తను నిలబడతానని చెప్పడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు... మొత్తం కేసులెన్నో తెలుసా?

అనుమానంతో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

ఫిల్మ్ నగర్‌లో అనుమానాస్పద కార్మికుడు మృతి!

సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేనలో కీలక పదవి!

ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగానే నిద్రపోయారా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments