Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కళ్లు చెమర్చాయి - సుకుమార్‌

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (15:26 IST)
Sukumar rupam
హీరోకు ఫ్యాన్స్‌  ఉంటారు.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్‌ ఉంటారు.. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్‌ ఉంటారు.. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే. . దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే, సువీక్షిత్‌ బొజ్జా అనే నవ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన  సుకుమార్‌ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు. ‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌.. 
 
తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్‌ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్‌ రూపానికి తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్‌ అందరి దృష్టిని ఆకర్షించి హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్‌ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్‌ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్‌ ‘‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)

ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments