Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ కెమెరా ఎక్విప్‌మెంట్‌తో తీసిన జగడం చిత్రానికి 15 ఏళ్ళు

Advertiesment
Steven Spielberg
, బుధవారం, 16 మార్చి 2022 (13:35 IST)
Ram Pothineni
థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి. విడుదలైన కొన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోలేని చిత్రాలు ఉంటాయి. అందులో హీరో నటన, దర్శకత్వ ప్రతిభ, సన్నివేశాలు, పాటల గురించి ఇతరులు మాట్లాడుకునేలా ఉంటాయి. అటువంటి చిత్రమే 'జగడం'.
 
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'జగడం'. సరిగ్గా ఇదే రోజున... 2007లో మార్చి 16న విడుదల అయ్యింది. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి పదిహేనేళ్ళు పూర్తయింది. కానీ, సినిమాపై క్రేజ్ ఇంకా తగ్గలేదు. మాస్ సీన్స్, ముఖ్యంగా సుకుమార్ తీసిన హీరో ఎలివేషన్ సీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో ఉంటాయి! సినిమా డీవీడీ బాలీవుడ్ దర్శకుల లైబ్రరీల్లో ఉంటుంది. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, 'జగడం' సినిమాకూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించారు. సూపర్ 35 ఫార్మాట్‌లో షూట్ చేశారు. చాలా మంది టెక్నీషియన్స్‌కు రిఫరెన్స్‌గా నిలిచిన చిత్రమిది.
 
రామ్‌కు 'జగడం' రెండో సినిమా. ఇప్పుడు సినిమా, రామ్ పెర్ఫార్మన్స్ చూస్తే... కొత్త హీరో చేసినట్టు ఉండదు, ఎంతో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న హీరోగా కనిపిస్తారు. "జగడం చేసే సమయానికి రామ్‌కు 17 ఏళ్ళు. రాలేదని, చేయలేననే మాటలు అతడి నోటి వెంట వినలేదు. ఏం చేయాలని చెప్పినా... పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి చేసేవాడు. షార్ప్, బ్రిలియెంట్ యాక్టర్. షూటింగ్ చేసేటప్పుడు రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది" అని సుకుమార్ చెప్పారు.  
 
రామ్ - సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిటింగ్. 'జగడం'ను రీమేక్ చేస్తే? ఇద్దరి అభిమానులు, ప్రేక్షకుల కోరిక ఇది! 
 
'పుష్ప'తో సుకుమార్ మాస్ ఏంటనేది పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసింది. అయితే... తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ మాస్ గురించి తెలుసు. ఆల్రెడీ 'జగడం' చూశారు కదా! ఇక, రామ్ గురించి నార్త్ ఇండియన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకు ఆల్రెడీ తెలుసు. ఆయన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తుంటే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం 'ది వారియర్' చేస్తున్న రామ్, ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 'జగడం' రీమేక్ చేస్తే... నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పవచ్చు. 
 
సుకుమార్‌కు కూడా 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. రామ్‌తో ఇంకో సినిమా తీయాలని ఉంది. ఇద్దరి కలయికలో తప్పకుండా సినిమా వస్తుంది. "రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో తప్పకుండా చేస్తా. యాక్చువల్లీ... ఇప్పటి రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది" అని సుకుమార్ చెప్పారు. ఆయన అభిమానులు, రామ్ అభిమానులు, ఇద్దరి అభిమానులు 'జగడం' రీమేక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో "భీమ్లా నాయక్‌"కు బ్రహ్మరథం - కలెక్షన్ల వర్షం