Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

దేవీ
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (09:07 IST)
Veera Chandrahasa poster
వీర చంద్రహాస అనేది 'మహాభారతం'లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి యొక్క గొప్ప కథను చెబుతుంది.  పరాక్రమవంతుడు,  సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీయెన్స్ ఇచ్చేలా ఉంటుంది. 
 
కేజీయఫ్, సలార్ లాంటి యాక్షన్  చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన  కన్నడ  చిత్రం ‘వీర చంద్రహాస’. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా,  శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌పై ఎన్ ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. 
 
ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ  క్రియేషన్స్ బ్యానర్‌‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ ‘రీసెంట్‌గా కన్నడలో  విడుదలైన వీర చంద్రహాస’ చిత్రానికి హిట్  టాక్‌తో  పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్‌ను కూడా బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. సినిమా సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతున్నా .  తనదైన సంగీతంతో అందర్నీ అలరించిన రవి బస్రూర్ ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments