Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యాల సుబ్బయ్య సమర్పణలో మనసున్న తల్లి కథ ఎనభై శాతం పూర్తి

డీవీ
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:38 IST)
Manasunna talli katha
ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథతో  "తల్లి మనసు". చిత్రాన్ని మలుస్తున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు .పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్  (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 
 
 హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు పాటలతో పాటు 80 శాతం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ, ఇంకో పాటతో పాటు మిగతా టాకీ పార్ట్ చిత్రీకరించడంతో ఈ నెలాఖరుకు షూటింగ్ మొత్తం ముగుస్తుందని చెప్పారు. షూటింగ్ ఆరంభించిన నాటి నుంచి గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ జరుపుతున్నామని ఆయన వివరించారు. మా నాన్న చిత్రాల స్థాయికి తగ్గట్టుగా చక్కటి కథ, కథనాలతో తీస్తున్న చిత్రమిదని ఆయన చెప్పారు. సోషల్ మీడియా లో ఇటువంటి కథాబలం ఉన్న మంచి చిత్రాన్ని తీస్తుండటం పట్ల విశేషమైన స్పందన, అభినందనలు లభిస్తున్నాయని తెలిపారు. 
 
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, ఓ మంచి చిత్రాన్ని అందించాలన్న తపనతో  మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిదని, ఫామిలీ  ప్రేక్షకులతో పాటు యూత్ ను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. 
 
దర్శకుడు వి.శ్రీనివాస్  (సిప్పీ) మాట్లాడుతూ, వాస్తవ జీవితానికి దగ్గరగా, ఓ మధ్య తరగతి తల్లి పడే తపన, సంఘర్షను ఇందులో ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments