Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

డీవీ
శనివారం, 18 మే 2024 (10:27 IST)
Music Shop Murthy
ప్రస్తుతం కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే కాన్సెప్ట్ , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు.

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్‌ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.
 
అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
 
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
నటీనటులు : అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments