Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్ట్ ఆపరేషన్ జరిగింది. నేను క్షేమమే! - సంగీత దర్శకుడు శశి ప్రీతమ్

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (23:17 IST)
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'గులాబీ', 'సముద్రం' తదితర చిత్రాలు ఆయన సంగీతం అందించారు. తన ఆరోగ్యం గురించి పలు వార్తలు నేపథ్యంలో శశి ప్రీతమ్ వివరణ ఇచ్చారు.
 
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ "ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. హార్ట్‌లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్" అని అన్నారు.
 
డాక్టర్ అమీనుద్దిన్ ఒవైసీ మాట్లాడుతూ ‌"సెంచరీ హాస్పిటల్లో శశి ప్రీతమ్ కన్సల్టెంట్ డాక్టర్ నేనే. జూన్ 4న ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన మా దగ్గరికి వచ్చారు. హార్ట్ ఎటాక్ అని గ్రహించాను. యాంజియోగ్రామ్ చేసి, తర్వాత స్టంట్ వేశాం. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఐసీయూలో 24 గంటల్లో అబ్జర్వేషన్లో ఉంచాము. ఆయన చాలా త్వరగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన వాకింగ్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇతర సమస్యలు ఏవీ లేవు. ఇతర వ్యాధి లక్షణాలు కూడా కనిపించలేదు" అని అన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments