Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన షూటర్లు అరెస్టు!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (09:07 IST)
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపలు కాల్పులు జరిపిన షూటర్లలో ఇద్దరిని గుజరాత్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని సోమవారం అర్థరాత్రి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని విచారణ కోసం ముంబైకు తరలించనున్నారు. 
 
ఇటీవలే ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పుల జరిగిన కాల్పుల ఘటన సంచలనంగా మారిన విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారన్న ప్రచారం జరిగింది. పైగా, కాల్పులు జరిగిన సమయంలో హీరో కూడా ఇంటిలోనే ఉన్నాడు. ఈ కాల్పుల ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఇద్దరు నిందితులను గుజరాత్ రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, ఆదివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి. సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన నిందితులు హెల్మెట్లు ధరించారు. పక్కా ప్రణాళికతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా స్పందించారు. సల్మాన్ ఖాన్‌తో మాట్లాడి, ఆయనకు భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments